Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెమ్యూనరేషన్ విషయంలో మోసపోయనంటున్న యువతార!

రెమ్యూనరేషన్ విషయంలో మోసపోయనంటున్న యువతార!

సీరియళ్ల నుంచి సినిమాల వైపు వచ్చే సరికి.. ఈ ఫీల్డ్ మీద అంతగా అవకాశాలు లేకపోవడంతో తను మొదట్లో చాలా నష్టపోయానని.. ఒక విధంగా మోసపోయానని అంటోంది అవికా గోర్. ప్రైవేట్ సంభాషణల్లో ఈ అమ్మడు తన బాధను వెల్లగక్కుతోంది. ‘‘ఉయ్యాలా జంపాలా’’ సినిమాతో హీరోయిన్ అయిపోయిన ఈ అమ్మాయి తొలి సినిమాకే తన డిమాండ్‌కు తగ్గట్టుగా డిమాండ్ చేయలేకపోయానని అంటోంది. ‘‘చిన్నారి పెళ్లి కూతురు’’ సీరియల్ తో తనకొచ్చిన గుర్తింపు.. ఇమేజ్‌ను క్యాష్ చేసుకోలేకపోయానని తను అంటోంది.

ఆ సినిమాకు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే తీసుకొందట. టీనేజ్‌లోనే ఆ సినిమాలో చేసిన అవిక గోర్... ఆ మొత్తానికి అప్పట్లో చాలా సంతృప్తి పడిపోయానని చెప్పింది. తర్వాత అసలు విషయం అర్థం అయ్యిందని.. తన సినిమా చేసినా మార్కెట్‌ను గమనించే సరికి తనకు చాలా తక్కువ ఇచ్చారని అర్థం అయ్యిందని అవికా చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం చాలా అవేర్ నెస్ వచ్చిందని ఇక గతంలోలాగా మోసపోయేది ఉండదని అవిక స్పష్టం చేసింది.

ఇటీవల వచ్చిన ‘‘సినిమా చూపిస్తా మావా’’ కూడా సూపర్ హిట్ అనిపించుకోవడంతో అవిక చాలా హ్యాపీగా ఉంది. ఇక తను కూడా రెమ్యూనరేషన్ విషయంలో పక్కగా ఉండాలని... మార్కెట్ ఉంది కాబట్టి డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని అవిక భావిస్తోంది. మరి ఎంత అంటే.. మాత్రం ఇంతా అని కచ్చితంగా చెప్పడం లేదు. తొలి సినిమాకు తీసుకొన్న మొత్తానికి కనీసం ఐదురెట్ల స్థాయిలో అయినా అడగాలనే భావనతో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?