Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘రేయ్‌’ వచ్చేస్తోంది.. నమ్మొచ్చా.?

‘రేయ్‌’ వచ్చేస్తోంది.. నమ్మొచ్చా.?

ఈ నెల 27వ తేదీన ‘రేయ్‌’ సినిమా విడుదల. తాజా ప్రకటన ఇది. ఎప్పుడో పూర్తయిపోయినా ‘రేయ్‌’ సినిమా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రమిది. చిరంజీవి తొలి చిత్రం కూడా, రెండో సినిమా రిలీజ్‌ అయ్యాకనే వచ్చింది. అలా సాయిధరమ్‌ తేజ రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై చాలా రోజులైపోయాక, ‘రేయ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.

దర్శక నిర్మాత వైవీఎస్‌ చౌదరి రూపొందించిన ఈ సినిమా చాలాకాలంగా విడుదలకు నోచుకోకపోవడానికి తెరవెనుక అనేక కారణాలున్నాయట. గత ఏడాది ‘రేయ్‌’ సినిమా రిలీజ్‌ కోసం నానా హంగామా చేశారుగానీ, వైవీఎస్‌ చౌదరి ప్రయత్నాలు వర్కవుట్‌ కాలేదు. ఈసారి పక్కా.. అంటున్నాడు వైవీఎస్‌ చౌదరి. డేట్‌ ఫిక్స్‌ చెయ్యడమే కాకుండా, ‘100 పర్సంట్‌ శాటిస్‌ఫాక్షన్‌ గ్యారంటీ’ అంటున్న వైవీఎస్‌ చౌదరి, అస్సలేమాత్రం సినిమా డిజప్పాయింట్‌ చెయ్యదని తాజా ట్రైలర్‌తో భరోసా ఇచ్చేస్తున్నాడు.

డాన్సుల్లో అదరహో.. అని ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో మంచి మార్కులేయించుకున్న సాయిధరమ్‌తేజ అసలు సిసలు డాన్సింగ్‌ టాలెంట్‌ ఏంటో ‘రేయ్‌’ సినిమాలో చూడబోతున్నామట. అంతా బాగానే వుందిగానీ, మార్చి 27 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిపోవచ్చా.? ఈసారి సినిమా అనుకున్న టైమ్‌కే రిలీజ్‌ అయ్యేలా వుందిలెండి.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?