Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రోజా ఒక్కరు చాలు

రోజా ఒక్కరు చాలు

శల్యుడు ఒక్కడు చాలు, కర్ణుడిని విసిగించి శల్య సారథ్యం చేయడానికి. శకుని ఒక్కడు చాలు తప్పుడు అయిడియాలు ఇచ్చి, పక్క దారి పట్టించడానికి. అలాగే రోజా మా తల్లి ఒక్కరు చాలు వైకాపా పార్టీ అవకాశాలను దెబ్బ తీయడానికి. అలాగే అనిపిస్తోంది, కనిపిస్తోంది నంద్యాల ఎన్నిక సందర్భంగా ఆమె మాటలు చూస్తుంటే.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అనేవాడు, వైకాపా మంచికో, తేదేపా చెడ్డకో మొత్తానికి తను తటస్థంగా వుంటానని ప్రకటించాడు. అప్పుడు తేదేపా జనాలు ఏం చెబుతున్నారు. ఆయన అలా అన్నా సరే, ఆయన అభిమానుల మద్దతు తమకే వుంటుందని కదా? కానీ వైకాపా ఏం చేయాలి. వీలయినంత సైలెంట్ గా వుండాలి. 

హమ్మయ్య, పవన్ బహిరంగ మద్దతు లేదు అని కామ్ గా ఊరుకోవాలి. కానీ మా రోజా మా తల్లి అలా ఊరుకోరు కదా? కెలికి కెలికి నిద్రపోయేవాడిని లేపి, రచ్చ చేసుకునే వ్యవహారం.

అందుకే ఏమంటున్నారు ఆమె..'పవన్ కు ముందే తెలిసిపోయింది, తేదేపా ఓడిపోతుందని, అందుకే మద్దతు ఇవ్వనన్నారు' అని. ఇప్పుడు పవన్ మనసు మార్చుకుని, అవునా? అలా అనిపించిందా మీకు, సరే అయితే నేను మద్దతు ఇస్తా, అని అంటే. వైకాపా నోటి దాకా వచ్చిందనుకున్న కూడు నేలపాలు అవుతుంది.

రాజకీయాలు అంటే నోరు పెట్టుకుని పడిపోవడం మాత్రమే కాదు, అవసరం అయినపుడు నోరు అదుపులో పెట్టుకోవడం కూడా. ఆ సంగతి ఈవిడకు ఎవరు చెబుతారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?