Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రుద్రమదేవి ఎక్కడ?

రుద్రమదేవి ఎక్కడ?

సినిమా నిర్మాణానికి ముందు, నిర్మాణ సమయంలో, ఆఖరికి పోస్టుప్రొడక్షన్ లొ కూడా ఎప్పటి కప్పుడు అప్ డేట్ లు వస్తుండేవి రుద్రమదేవి సినిమా గురించి, ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. రీ రికార్డింగ్ వ్యవహారాలు కూడా దాదాపు ముగిసాయి. కానీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది మాత్రం తెలియడం లేదు. 

రుద్రమదేవికి అయిన ఖర్చు, దాని స్టామినా, బయ్యర్లు పెట్టగల రేట్లు ఇవన్నీ చూసుకుంటే, కొంచెం తేడాగావుందని వినికిడి. అందుకే సినిమా వ్యవహారం ఏదీ తెలియడం లేదు. సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ డూపర్ హిట్ అయి వుంటే, ఆ ఊపులో, అల్లు అర్జున్ ఇమేజ్ ను వాడుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొంచెం తేడా వచ్చింది.

రుద్రమదేవిని ఎంత కాదనుకున్నా మే 15 నాటికన్నా థియేటర్లలోకి తేవాలి. లేదంటే, సమ్మర్ ను క్యాష్ చేసుకోవడానికి వీలు కాదు. ఇప్పటికే మే 15న పండగ చేస్కో డేట్ వచ్చేసింది. ఆ లోపు ఖాళీలు లేవు, వచ్చే వీలు కనిపించడం లేదు. మరీ మే మూడోవారానికి వెళ్లిపోతుందా రుద్రమదేవి అని అనుమానంగా వుంది. ఏ విషయమూ పెదవి విప్పడం లేదు గుణశేఖర్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?