Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో ఫస్ట్ లుక్ పై నీలి నీడలు

సాహో ఫస్ట్ లుక్ పై నీలి నీడలు

ఆల్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన హోమ్ బ్యానర్ లో చేస్తున్న లేటెస్ట్ సినిమా సాహో. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలచేసారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ ను విడుదల చేసారు. ఇలా విడుదల చేయడం ఏమిటి అలా సంచలనాలు నమోదు చేసింది. సినిమా ప్రముఖులు అంతా సాహో.. సాహో అంటున్నారు.

కానీ ఇంతలోనే సోషల్ నెట్ వర్క్ మరో విధంగా ఏక్టివ్ అయింది. ఈ సాహో ఫస్ట్ లుక్ హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్ 2049కు కాపీ అంటూ విడియోలు తయారైపోయాయి. వాట్సప్ లో తెగ తిరిగేస్తున్నాయి. ఈ మధ్యనే విడుదలయిందీ సినిమా. ఈ సినిమా స్టిల్స్ కొన్ని సాహోలో ప్రభాస్ గెటప్ ను పోలినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని స్టిల్స్ అయితే ఈ ఫస్ట్ లుక్ కు బాగా దగ్గరగా వున్నాయి. దీంతో ఇప్పడు రివర్స్ హడావుడి మొదలయింది.

ఈ సంగతి అలా వుంచితే, సాహో ఫస్ట్ లుక్ కు మాత్రం మంచి రెస్పాన్స్ నే వస్తోంది. బాహుబలి సినిమా ప్రభాస్ కు తెచ్చి పెట్టిన క్రేజ్ ఎంత అన్నది ఇప్పుడు క్లియర్ గా తెలుస్తోంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?