Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'సాహసానికి' మళ్లీ సమస్య?

'సాహసానికి' మళ్లీ సమస్య?

నాగచైతన్య..గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఎప్పుడో మొదలైన సినిమా సాహసం శ్వాసగా సాగిపో.. ఈ సినిమా అడుగు అడుగు వేసుకుంటూ.. ఆడియో ఫంక్షన్ దాకా వచ్చింది..ఈ జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసల సారాశం ఏమిటంటే.. ఈ సినిమా జూలైలో విడుదల కావడం అంటే కాస్త కష్టమే అని. 

దీనికి తెలుగు వైపు కన్నా, తమిళ వెర్షన్ వైపే సమస్యలు వున్నాయని. అటు కాస్త ఫైనాన్షియల్ సమస్యలు క్రాప్ అప్ అయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీ క్రాస్ చేసుకుని, జూలైలో రావడం కాస్త కష్టమే అని వినికిడి. పైగా జూలై లో ఇప్పటికే 1 రోజులుమారాయి.. 8న నాయకి, 15 కబాలి, 29న బాబు బంగారం ఫిక్స్ అయిపోయాయి. ఇక మిగిలింది ఆ మధ్యలో తేదీ మాత్రమే. 

మరి అలాంటపుడు కిందా మీదా పడి రావడం ఎలా అన్నది సమస్య. అయితే ఇక్కడ ఇంకో సమస్య వుంది. ఆగస్టులో నాగ్ చైతన్య మరో సినిమాను షెడ్యూల్ చేస్తున్నారు. అందువల్ల జూలైలో రాలేకపోతే, సెప్టెంబర్ లో అక్టోబర్ కో వెళ్లిపోవాల్సి వుంటుంది. మరి ఏమవుతుందో.. వెయిట్ అండ్ సీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?