Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహసం శ్వాసగా..వస్తుందా?

సాహసం శ్వాసగా..వస్తుందా?

సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఆగస్టు 19న వస్తుందని ప్రెస్ నోట్ ఇచ్చేసారు. కానీ ముమ్మాటికీ రాదన్నదే ఇండస్ట్రీ గుసగుసల సారాంశం. అన్ని సినిమాలు వస్తునాయి, ఇది రావడం లేదని జనాలు అనుకుంటారని, అనుకుంటున్నారని ప్రెస్ నోట్ ఇచ్చేసారు తప్ప, సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది. 

పాపం కోన వెంకట్ ఇనీషియేట్ చేయడంతో నిర్మాత 20 కోట్లు ఒకేసారి తీసుకెళ్లి దర్శకుడు గౌతమ్ మీనన్ చేతిలో పోసారు. దాంతో తెలుగు వెర్షన్ ఫస్ట్ కాపీ చేతికివ్వాలన్నది అగ్రిమెంట్. కానీ ఈ రోజుకు ఫస్ట్ కాపీ లేదు. ఆ డబ్బులతో మొత్తం సినిమా చుట్టేసి, తమిళ వెర్షన్ లాభంగా చేసుకోవాలనుకున్నారేమో గౌతమ్ మీనన్. కానీ ఇప్పుడు అక్కడ ఫైనాన్స్ సమస్యలు చుట్టుముట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. 

శింబు సమస్యలు కొంతకాలం, ఫైనాన్స్ సమస్యలు అన్నీ కలిసి పాపం తెలుగు నిర్మాత 20 కోట్లను గాల్లో దీపంగా మార్చేసాయి. సినిమా ఎప్పుడు వస్తుందో కానీ, వడ్డీలు తడిసిమోపెడై, లాభాలను సినిమా విడుదలకు ముందే పీల్చేస్తున్నాయి. తెలుగు హీరోలు ఇక పై గౌతమ్ మీనన్ ద్విభాషా చిత్రాలను నమ్ముకోకూడదు అని అనుకుంటున్నారట.  అయితే సాయి ధరమ్ తేజ ను ముగ్గులోకి లాగి మరో ద్విభాషా చిత్రం చేయాలన్నది గౌతమ్ మీనన్ ప్లాన్ అంట. అయినా ముందు ఈ సాహసం పూర్తి కావాలి కదా..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?