Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిధరమ్ మరో సినిమా ఫిక్స్

సాయిధరమ్ మరో సినిమా ఫిక్స్

జవాన్ సినిమా సెట్ లో వుండగానే మరో రెండు సినిమాలు లైన్ లో సెట్ చేసుకున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. వివి వినాయక్ డైరక్షన్ లో నిర్మాత సి కళ్యాణ్ నిర్మించే సినిమా ఒకటి. ఈ వార్త ఇఫ్పటికే బయటకు వచ్చింది. మరొకటి ఇప్పుడు ఫిక్సయింది. కరుణాకరన్ డైరక్షన్ లో నిర్మాత కేఎస్ రామారావు నిర్మించే సినిమా మరొకటి. 

కరుణాకరణ్ మాంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీస్తారని పేరు పడ్డారు. అయితే ఆయన కెరీర్ లో హిట్ లు ఎన్ని వున్నాయో, ఫ్లాప్ లు అన్నీ వున్నాయి. అయినా కరుణాకరన్ కు ఇంతో అంతో క్రేజ్ వుంది.

అందుకే ఈ ప్రాజెక్టు కు సాయి ధరమ్ ఒకె చెప్పినట్లు కనిపిస్తోంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమా అందించిన తరువాత నిర్మాత కేఎస్ రామారావు అందిస్తున్న చిత్రం ఇది.

అయితే వినాయక్, కరుణాకరన్ సినిమాల్లో ఏది ముందు ఏది వెనుక అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎవరి స్క్రిప్ట్ ముందు రెడీ అయితే వాళ్లది సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?