Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయి ధరమ్ రెమ్యూనిరేషన్ ఎంత?

సాయి ధరమ్ రెమ్యూనిరేషన్ ఎంత?

యంగ్ హీరోల రెమ్యూనిరేషన్లు బాగానే వుంటున్నాయి ఇప్పుడు. నాని లాంటి వాళ్లు అయిదు కోట్లకు కాస్త అటుగానే వున్నారు. శర్వా కూడా దాదాపు అక్కడకు దగ్గరే వున్నాడు. నిఖిల్, వరుణ్ తేజ మూడు దాటేసారు.

సరే, వీళ్ల సంగతి అలా వుంచితే, మెగా లెగసీని మాస్ రూట్లో ముందుకు తీసుకెళ్దామని కిందా మీదా అవుతున్నాడు సాయి ధరమ్ తేజ. మరి అతగాడి సంగతేమిటి?

వరుస ఫ్లాపులే తప్ప, విజయాలు పలకరించడం లేదు. అందువల్ల రెమ్యూనిరేషన్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం చేస్తున్న వివి వినాయక్ కాంబో ఇంటిలిజెంట్ కోసం సాయి ధరమ్ కు వచ్చిన రెమ్యూనిరేషన్ జస్ట్ రెండున్నర కోట్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిర్మాత కళ్యాణ్ అయితే అయిదు కోట్ల రెమ్యూనిరేషన్ హీరోకి అని అంటున్నారు. కానీ అంతలేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయి ధరమ్ కు ఇచ్చింది జస్ట్ రెండున్నర కోట్లే అని వినికిడి.

ఆ మాటకు వస్తే గతంలో నటించిన విన్నర్, ఆ తరువాత సినిమాలకు కూడా పెద్దగా అందుకున్నది లేదట. సరైన హిట్ పడితే రెమ్యూనిరేషన్ సర్రున ముందుకు వెళ్తుంది. ఆ హిట్ కోసమే చూస్తున్నాడట సాయి ధరమ్ తేజ.

అయితే రెమ్యూనిరేషన్ తక్కువైనా సాయి ధరమ్ కు సమస్య లేదు. ఎందుకంటే డబ్బుల దగ్గర మేనమామ పవన్ పోలికలేనట. చాలా జాగ్రత్తగా వుంటాడు. వేళ్ల మధ్య నుంచి రూపాయి జారనివ్వడు అని టాక్. ఆ మాత్రం జాగ్రత్త వుండాలి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?