Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లీకులతో బెదిరిపోతున్న కండలవీరుడు

లీకులతో బెదిరిపోతున్న కండలవీరుడు

సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడంటే బాలీవుడ్ జనాల చూపంతా ఆ మూవీపైనే ఉంటుంది. దీంతో సహజంగానే లీకులు కూడా జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న టైగర్ జిందా హై సినిమా మాత్రం లీకుల్లో రికార్డు సృష్టించేలా ఉంది. ఏ దేశంలో ఏ షెడ్యూల్ చేసినా ఏదో ఒక వీడియో లేదా ఫోటో నెట్ లో ప్రత్యక్షమైపోతోంది. 

తాజాగా లండన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ పిక్చరైజ్ చేశారు. ఈ యాక్షన్ బ్లాక్ కు సంబంధించి కీలకమైన విజువల్స్ ను ఎవరో నెట్ లో పెట్టేశారు. ఇదొక్కటే కాదు.. టైగర్ జిందా హై సినిమాకు సంబంధించి ఇలాంటివి దాదాపు 6క్లిప్స్ నెట్ లోకి వచ్చేశాయి. 

ఈ లీకులతో తెగ ఇబ్బందిపడుతున్నాడు సల్మాన్ ఖాన్. అసలే లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్ ఫ్లాప్ అయింది. ఇలాంటి టైమ్ లో వస్తున్న ఈ లీకులు, ఎక్కడ కొత్త సినిమాపై హైప్ ను దెబ్బతీస్తాయో అని సల్మాన్ భయం.

అయితే ట్యూబ్ లైట్ ఫ్లాప్ అయినా టైగర్ జిందా హైకి మాత్రం మార్కెట్ తగ్గలేదు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ (శాటిలైట్ తో సహా) ఇప్పటికే పూర్తయింది. సల్మాన్-కత్రిన జంటగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?