Advertisement


Home > Movies - Movie Gossip
సమంత అక్కినేని.. మార్పు క్లియర్

ఈ తరం హీరోయిన్లలో సమంతతో ఓ ట్రెండ్ స్టార్ట్ అయింది. అకేషన్ ను బట్టి, ప్రత్యేకంగా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి అకేషన్ కు డ్రెస్ డిజైన్ చేయించుకోవడం వంటివి సమంతతో స్టార్ట్ అయ్యాయి. రకుల్ అదే ఫాలో అవుతోంది. మిగిలిన వారు కూడా ఇప్పుడు ఆ రూట్ లోనే వున్నారు. 

అందుకే సినిమా ఫంక్షన్ లు అంటే సమంత ఎలాంటి డ్రెస్ తో వస్తుంది అన్న ఆసక్తి వుంటుంది. అలాంటి సమంత ఇప్పుడు లేటెస్ట్ గా రాజుగారి గది 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయింది. ఏమాత్రం హడావుడి లేకుండా, సింపుల్ గా డ్రెస్ చేసుకుని, ఆ డ్రెస్ కూడా దాదాపు మెడ వరకు వుండే డ్రెస్. అంతే కాదు, తరచు తన డ్రెస్ సరిగ్గా వుందా లేదా అని సర్దుకోవడం కనిపించింది. 

తనను అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు తాను సమాధానం చెప్పకుండా నాగ్ కు మైక్ ఇచ్చేయడం విశేషం. అక్కినేని కోడలిగా బాధ్యతల గురించి అడిగితే, సమయస్ఫూర్తిగా తనే సమాధానం చెప్పింది సమంత. 

మొత్తానికి ఇదే సమావేశంలో నాగ్ క్లియర్ గా చెప్పినట్లు సమంత చాలా తెలివైనంది.