Advertisement


Home > Movies - Movie Gossip
సమంత కోరిక తీర్చనున్న 'రాజుగారి గది 2'

సమంత ఈ మధ్య ఒకటి రెండుసార్లు తన మనసులోని మాట బయట పెట్టింది. సరైన సవాల్ లాంటి పాత్ర వస్తే పోషించాలని వుంది అన్నది ఆ మనసులోని మాట. ఇప్పుడు రాజుగారి గది 2 సినిమా గురించి వినిపిస్తున్న సంగతులు నిజమైతే ఆ కోరిక తీరిపోయేలాగే వుంది.

రాజుగారి గది 2 సినిమాను ఇటీవల ఒకటి రెండు షో లు ప్రత్యేకంగా వేసారు. సినిమా రంగానికి చెంది, ఈ సినిమా బిజినెస్ తో అసోసియేట్ అయిన కొందరు ఈ సినిమాన చూసారు. 

ఇలా చూసిన వాళ్లంతా చెబుతున్న కీలకమైన సంగతి ఏమిటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ హర్రర్ కామెడీ జోనర్ లోనే వుంటుంది కానీ, సెకండాఫ్ మాత్రం చాలా బాగా వర్కవుట్ అయిందని. ఈ సెకండాఫ్ లో నాగ్-సమంతల మధ్య నడిచే గేమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు బాగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు. 

సమంత కెరీర్ లో ఈ రోల్ టాప్ టెన్ లో ఒకటిగా మిగులుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమషాలు నాగ్-సమంత కలిసి స్టీల్ ది షో అనిపించుకుంటారని చూసిన సినిమా జనాలు చెబుతున్న మాట. చూద్దాం నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందిగా. సమంత కాస్తా అక్కినేని సమంత చైతన్యగా మారిన తరువాత వస్తున్న తొలి సినిమా ఇది.