Advertisement


Home > Movies - Movie Gossip
సమంత-నాగచైతన్య కాంబినేషన్ వర్కవుట్ అవ్వదట..?

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికే వీళ్లిద్దరూ కలర్ ఫుల్ జోడీ అనిపించుకున్నారు. పైగా నిజజీవితంలో కూడా భార్యాభర్తలుగా మారబోతున్నారు. దీంతో ప్రేక్షకులకు మరోసారి ఈ జంటను తెరపై చూడాలని అనిపించడం సహజం. అక్కినేని ఫ్యాన్స్ కైతే ఆ కోరిక ఇంకాస్త ఎక్కువే. వీళ్ల కోరికలకు తగ్గట్టే.. చైతూ-శామ్ కలిసి మరో సినిమాలోలో నటించబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. ఇది చాలదన్నట్టు, ఈ కాంబినేషన్ ను త్రివిక్రమ్ డైరక్ట్ చేయబోతున్నాడంటూ మరో న్యూస్.

వాస్తవానికి చైతూ-సమంత కలిసి నటించే అవకాశాలు చాలా తక్కువ. టెక్నికల్ గా చూస్తే నాగచైతన్య ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సమంత కూడా ఏకంగా 4 సినిమాలకు కాల్షీట్లు కేటాయించింది. పోనీ, ఎలాగోలా ఎడ్జెస్ట్ చేసుకుని నటిద్దామనుకున్నప్పటికీ వీళ్లిద్దరి కంటే త్రివిక్రమ్ ఇప్పుడు ఇంకా బిజీ. పవన్ కల్యాణ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న త్రివిక్రమ్.. వచ్చేనెల ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా త్రివిక్రమ్ కమిట్ మెంట్స్ చాలానే ఉన్నాయి.

పవన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ మూవీ చేసేందుకు అంగీకరించాడు త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి-పవన్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ఎనౌన్స్ చేశారు ఎంపీ సుబ్బరామిరెడ్డి. సో.. ఇవన్నీ కంప్లీట్ అయితే తప్ప నాగచైతన్య-సమంత మూవీ సెట్స్ పైకి రాదు.