Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒకేసారి ముగ్గురమ్మాయిలతో హీరో ఎఫైర్స్!

ఒకేసారి ముగ్గురమ్మాయిలతో హీరో ఎఫైర్స్!

సంజయ్ దత్.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ లో ఒకడు. మాస్ ఇమేజ్, స్టార్ స్టేటస్.. హీమ్యాన్ లుక్.. వీటితో దత్ కు కొంతమంది హీరోయిన్లు పడిపోయారు. వీటిల్లో కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చాయి.. మరి కొన్ని బయటకు రాలేదు. టాడా కేసులో అరెస్టయ్యే సమయానికి దత్ నాటి భారతదేశ డ్రీమ్ గర్ల్ మాధురీ దీక్షిత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

అప్పటికే దత్ మొదటి భార్య మరణించింది. దీంతో.. మాధురీని పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే అరెస్టు కావడంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత దత్ కు మరో పెళ్లి, ఆపై ఇంకో పెళ్లి కూడా అయ్యాయి. ఓవరాల్ గా మూడు పెళ్లిళ్లు. ఇవన్నీ బయటకు తెలిసిన విషయాలు కానీ.. తను ఒకేసారి ముగ్గురమ్మాయిలతో రొమాంటిక్ స్టోరీలను నడిపించానని దత్ తాజాగా ప్రకటించాడు.

ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దత్ సరదాగా, బోల్డ్ గా మాట్లాడాడు. ఒకేసారి రెండు రొమాంటిక్ రిలేషన్ షిప్స్ ను కొనసాగించారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. రెండు కాదు, మూడు అన్నాడు దత్. ఒకేసారి ముగ్గురమ్మాయిలతో తన ప్రేమ వ్యవహారాలు నడిచాయని వివరించాడు.

మరి ఇబ్బంది ఎదురు కాలేదా? అంటే.. తెలివి ఉంటే సాధ్యమే అన్నాడు. నడిపించే టాలెంట్ ఉంటే ఇబ్బందులు రావన్నాడు. ఒక అమ్మాయికి తెలీయకుండా మరో అమ్మాయితో వ్యవహారాన్ని నడిపించవచ్చని.. బోధించాడు. మొత్తానికి తను ప్లేబాయ్ లైఫ్ నే లీడ్ చేశానని.. దత్ స్పష్టంగానే చెప్పాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?