Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతి సినిమాలపై పిడుగు

సంక్రాంతి సినిమాలపై పిడుగు

సంక్రాంతికి విడుదల కోసం ఉరకలు వేస్తున్న టెంపర్‌, గోపాల గోపాల చిత్రాలకి అనూహ్య అడ్డంకి ఎదురైంది. కొంత కాలంగా సినిమా నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న వివాదం మరోసారి తారాస్థాయికి చేరుకుంది. నిర్మాతలు తమ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చకపోవడంతో కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకి పిలుపునిచ్చాయి. 

అంటే ఉన్నపళంగా షూటింగ్స్‌ అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోతాయి. ఇది తొందరగా తేలకపోతే కనుక సంక్రాంతికి వచ్చే సినిమాలు సూప్‌లో పడిపోతాయి. ఇంకా రెండు చిత్రాల షూటింగ్‌ చాలా వరకు బ్యాలెన్స్‌ ఉంది. డిసెంబర్‌లో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతాయి. ఇప్పుడు కనుక ఈ సమ్మె ఒక వారం, పది రోజులు ఉన్నట్టయితే సంక్రాంతి రిలీజ్‌ కష్టమైపోతుంది. 

సంక్రాంతి రిలీజ్‌ కోసమని రెడీ అవుతోన్న ఈ భారీ చిత్రాలు ఆ డేట్‌ని మిస్‌ అయితే బిజినెస్‌పై చాలా భారం పడుతుంది. మిగిలిన వారి మాటెలా ఉన్నా కానీ ఈ రెండు సినిమాలకి మాత్రం ఈ సమ్మె ఇమ్మీడియట్‌గా కాల్‌ ఆఫ్‌ అయి తీరాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?