Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ సిరీస్ లో సప్తగిరి

పవన్ సిరీస్ లో సప్తగిరి

సడెన్ గా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, సర్రున దూసుకుపోయాడు సప్తగిరి. ఆ ఊపుతోనే, ఆ స్పీడుతోనే సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ హీరోగా ఓ సినిమా కూడా చేసేసాడు. కమర్షియల్ గా బాగానే వర్కవుట్ అయింది. ఆ ధైర్యంతోనే అదే బ్యానర్ లో, అదే నిర్మాతతో మరో సినిమా కూడా హీరోగా చకచకా ఫినిష్ చేసేసాడు. ఆ సినిమాకు కూడా సప్తగిరి ఎల్ ఎల్ బి అని టైటిల్ పెట్టడం విశేషం.

సప్తగిరి చేస్తున్న సినిమాకు పవన్ కళ్యాణ్ కు ఓ లింక్ వున్నట్లు తెలుస్తోంది. హిందీలో జాలీ ఎల్ఎల్బీ అనే సినిమా వచ్చింది. ఆ తరువాత దాని సీక్వెల్ కూడా వచ్చింది. జాలీ ఎల్ఎల్బీ పార్ట్ 2ను హారిక హాసిని వాళ్లు కొన్నారు. పవన్ తో తీయాలని ఆలోచన వుంది. కానీ ఇంకా చాలా టైమ్ పడుతుంది.

ఈ లోగా అదే జాలీ ఎల్ఎల్బీ పార్ట్ వన్ ను సప్తగిరి నిర్మాతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాన్నే ఇప్పుడు ఫ్రీ మేక్ గా సప్తగిరి ఎల్ ఎల్ బి అంటూ తయారుచేస్తున్నారు. మాంచి ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ వున్న సినిమా. సప్తగిరి అలరించేందుకు చాలా స్కోప్ వుంటుంది. అన్నీ బాగానే వున్నాయి. కానీ పార్ట్ వన్ సప్తగిరి చేసాక, పార్ట్ 2 పవన్ చేస్తాడా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?