Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సర్దార్ టీజర్ నా..సరదా టీజర్ నా?

సర్దార్ టీజర్ నా..సరదా టీజర్ నా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లే(టు)టెస్ట్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ బయటకు వచ్చింది. ఈ ముఫై సెకండ్ల టీజర్ విడుదలకు ముందు సోషల్ నెట్ వర్క్ లో చాలా హడవుడే జరిగింది. డైరక్టర్ బాబి అయితే తెగ ఎగ్జయిట్ అయిపోయారు. దేవీ ఆర్ ఆర్ అదిరిపోయిందని ట్వీట్ చేసారు.

దీంతో జనం అదేంటో..అందెంత సూపర్ గా వుంటందో అనుకున్నారు. కొందరు మాత్రం, అసలు సినిమా షూటింగ్ నే అయిదుశాతం కూడా అయి వుండదు..మరి టీజర్ ఏం చేస్తారోఅనుకున్నారు. అర్థరాత్రి టీజర్ బయటకు వచ్చింది. ఏనుగు సామెతలా మిగిలింది. ఇంతకు ముందు ఫస్ట్ లుక్, పోస్టర్లలో కనిపించిన గుర్రం, గబ్బర్ సింగ్ గెటప్ నే ఇందులోనూ కనిపించాయి.

Click Here For Teaser

అలా అలా స్లో మోషన్ లో పవన్ నడుచుకు వచ్చారు. ముందు పది సెకెండ్లు, చివర పది సెకెండ్లు వృధాపోయింది. ఈ పది సెకెండ్లు పవన్ కనిపించాడు. రెండో మూడో కెమేరాలు గ్రీన్ మాట్ బ్యాక్ డ్రాప్ లో పెట్టి, గ్రాఫిక్స్ జోడించినట్లు అనిపించింది టీజర్.

పైగా దేవీ అంత అదరగొట్టిందీ లేదు. సవాలక్ష కౌబాయ్ సినిమాల్లో విన్న ఇనుస్ట్రుమెంటేషన్, ఆ తరువాత గబ్బర్ సింగ్ సిగ్నేచర్ ట్యూన్. ఎందుకింత నీరసమైన టీజర్ వదిలినట్లో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?