Advertisement


Home > Movies - Movie Gossip
సావిత్రి విడియోలో ఏముంది?

సావిత్రి బయోపిక్ మహానటి ముస్తాబవుతోంది. కీర్తి సురేష్, సమంతలతో పాటు అనేకానేక మంది సినిమా ప్రముఖులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విడియో రేపు రాబోతోంది. మహానటి సావిత్రి జయంతి సందర్భంగా రేపు మహానటి యూనిట్ ఓ చిన్న విడియోను విడుదల చేయబోతోంది.

ఈ విడియో ఒక విధంగా సావిత్రిగా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ అనుకోవాలి. కానీ అలా అని ఫస్ట్ లుక్ పూర్తిగా కనిపించదు. దూరం నుంచి అది కూడా వెనుక నుంచి కీర్తి సురేష్ ను సావిత్రి గెటప్ లో చూస్తే ఎలా వుంటుందో ఆ మేరకు మాత్రమే విడియోలో చూపించే అవకాశం వుంది.

అంటే ఈ విడియో తరువాత సావిత్రి అభిమానులకు ఓ క్లారిటీ వస్తుంది. సావిత్రిగా కీర్తి సురేష్ ఎలా వుండబోతుందన్నది కాస్త క్లారిటీ వస్తుంది. గతంలో ఓ లుక్ బయటకు వచ్చింది. అది సావిత్రి లుక్ లాగే వుంది. కానీ కాదని ఖండించింది యూనిట్. అందువల్ల రేపు విడుదల చేయబోయే విడియో కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది.