Advertisement


Home > Movies - Movie Gossip
సీన్లు వెనక్కు పెడుతున్నారా?

సినిమా విడుదల తరువాత కొన్ని సీన్లు, లేదా ఓ పాట కలపడం అన్నది యూజువల్ గా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. లెంగ్త్ పెరిగిందనో, కథకు అడ్డం పడుతోందనో ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసి పక్కన పెట్టడం మామూలే. అలాంటి వాటిని కొన్ని వారాలు సినిమ ఆడిన తరువాత, హీరో అభిమానుల కోసం జోడిస్తుంటారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని అజ్ఞాతవాసి సినిమా విడుదలకు అంతా రెడీ అయింది. సినిమా ఫైనల్ ఎడిటింగ్ లో కొంత ఫుటేజ్ సహజంగానే వుండిపోయింది.

ఇలా వుండిపోయిన ఫుటేజ్ లో రెండు మూడు మంచి సీన్లు వున్నాయని, వీటిని పక్కక పెట్టక తప్పలేదని తెలుస్తోంది. ఆ సీన్లను సినిమా విడుదలయిన రెండు వారాలకు కలిపే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

సినిమాకు ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి వచ్చే ఆదరణ చూసుకుని, ఆఫైన ఆ సీన్లను జోడించే అవకాశం వుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ తీసిన సన్నివేశాలు అంటే సినిమాలో ఎప్పుడు జోడించినా ఆసక్తికరంగానే వుంటాయి.