Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సీనియర్ వంశీ సినిమా ఇప్పట్లో కాదు

సీనియర్ వంశీ సినిమా ఇప్పట్లో కాదు

సీనియర్ వంశీ సినిమా వచ్చి చాలాకాలం అయింది. తను మొన్నే వెళ్లిపోయింది.. అంటూ తీసిన సినిమా, ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నా కూడా విడుదలకు నోచుకోలేదు. ఇక దుకాణం సర్దేసినట్లే అని అనుకుంటున్న టైమ్ లో, మధుర శ్రీధర్ ఫ్యాషన్ డిజైనర్ అంటూ లేడీస్ టైలర్ సీక్వెల్ ను బయటకు తీసాడు.

రాజ్ తరుణ్ ను హీరోగా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలు ఎక్కే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే అసలు ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ, స్క్రిప్ట్ నెరేషన్ కే సీనియర్ వంశీ చాలా కాలం తీసుకున్నారు. ఆఖరికి రైటర్ రవి సాయం పట్టి, మాంచి స్క్రిప్ట్ అల్లడంతో కొంత వరకు ఓకె అయింది.

కానీ ఈ లోగా రాజ్ తరుణ్ వేరే సినిమాల మీదకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ నెలలో రాజ్ తరుణ్-విష్ణు సినిమా ప్రారంభమవుతోంది.. వచ్చేనెల మారుతి కథతో, గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమాకు శ్రీకారం చుడతారు. ఈ రెండూ పూర్తయితే తప్ప, వంశీ సినిమా ప్రారంభం కాదు. కానీ ఈలోగా మరే ప్రాజెక్టు అడ్డం పడుతుందో తెలియదు.

పైగా నిర్మాత మధుర శ్రీధర్ ఇప్పుడు తను-టీవీ 9 తో కలిసి నిర్మిస్తున్న ‘ఒక్క మనసు’ సినిమా షూటింగ్ లో హడావుడిగా వున్నాడు. అది అయితే కానీ ఆయనా ఫ్రీ కారు. సో మొత్తానికి సీనియర్ వంశీ ఫ్యాషన్ డిజైనర్ మార్చిలోనో, ఆ తరువాతనో తప్ప మొదలు కాకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?