Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెప్టెంబర్ 27 స్పైడర్ డేట్

సెప్టెంబర్ 27 స్పైడర్ డేట్

స్పైడర్ దసరాకు వస్తోందని మహేష్ బాబు ప్రకటించారు. కానీ డేట్ ఏదన్నది ప్రకటించలేదు. దసరా సీజన్ సెప్టెంబర్ 22 నుంచి 30 దాటే వరకు వుంది. సెప్టెంబర్ 29న బాలయ్య-పూరి కాంబినేషన్ లోని సినిమా విడుదలకు డేట్ ముందే ప్రకటించారు. మరి స్పైడర్ డేట్ ఏమిటి?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సెప్టెబర్ 27 లేదా 28 (బుధ, గురు) తేదీలను స్పైడర్ విడుదలకు ఆలోచిస్తున్నారు. 99శాతం సెప్టెంబర్ 27నే విడుదల చేస్తారు. ఎందుకంటే ఆ రోజు బుధవారం. దసరా సెలవులు కాబట్టి, టోటల్ గా ఆరు నుంచి ఏడు రోజులు సెలవులను క్యాష్ చేసుకోవచ్చు.

ముందుగా అయితే 22న వద్దాం అన్న ఆలోచన వుంది కానీ, 27నే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు అంతా చెప్పడంతో ఆ డేట్ కే దాదాపు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్పైడర్ విడుదల డేట్ తో లెక్క వేసుకుంటే, దాదాపు ఏడాది పాటు నిర్మాణం జరుపుకున్నట్లు అవుతుంది.

బాలయ్య సినిమా 29, మహేష్ సినిమా 27 అయితే ఎన్టీఆర్ జై లవకుశ డేట్ ఏమిటో ఇంకా తెలియదు. బహుశా దీపావళికి ఫిక్స్ అవుతారేమో? రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమాలు మేకింగ్ లోనే వున్నాయి. దసరాకు అని వినవచ్చింది కానీ, ఇంకా పక్కా కాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?