Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెప్టెంబర్ కూడా ఫుల్ బిజీనా

సెప్టెంబర్ కూడా ఫుల్ బిజీనా

కొన్నాళ్ల క్రితం స్పైడర్ సినిమా సెప్టెంబర్ విడుదల అన్నపుడు, ఆ నెల మొత్తానికి ఒక్క సినిమా కూడా లేదు. ఆ తరువాత జై లవకుశ డేట్ వచ్చింది. అంతలో పైసా వసూల్ లైన్ లోకి వచ్చింది. జవాన్ కూడా సెప్టెంబర్ లోనే అంది. ఇలా వరుసగా సినిమాలు ఒకటీ ఒకటీ సెప్టెంబర్ కు చేరడం ప్రారంభమైంది.

ఇప్పుడు సెప్టెంబర్ 1న పైసా వసూల్, రెండున ఉంగరాల రాంబాబు, 8న నాగ్ చైతన్య 'యుద్ధం శరణం', మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' 21న జై లవకుశ, 27న స్పైడర్, 29 లేదా 30న సాయి ధరమ్ తేజ 'జవాన్' సినిమాలు సెప్టెంబర్ కు ఫిక్స్ అయ్యాయి. అంటే ఎనిమిది సినిమాలు.

ఇంకా టైమ్ వుంది కాబట్టి ఇంకా మరిన్ని సినిమాలు ప్లాన్ చేసుకునే అవకాశం వుంది. అంటే ఈ లెక్కన సెప్టెంబర్ కూడా థియేటర్ల దగ్గర సినిమాల తొడతొక్కిడి తప్పదన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?