Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమిళ్‌పాదం-2, సుడిగాలి మొదలైంది!

తమిళ్‌పాదం-2, సుడిగాలి మొదలైంది!

తమిళ సినిమాలపై సెటైరిక్ గా రూపొందిన సినిమా ‘తమిళ్ పాదం’. అల్లాటప్పా ప్రొడ్యూసర్లు అయితే ఇలాంటి సినిమాను ఒకటి రూపొందించి, విడుదల చేయలేదు. అందునా తమిళనాట. ఈ సినిమా వెనుకు కరుణానిధి మనవడు దయానిధి అళగిరి ఉండటంతో ఆ సెటైరికల్ సినిమా రూపొందింది, విడుదల అయ్యింది. తమిళ సినిమా రూపకర్తలపై బ్రహ్మాండమైన సెటైర్లు వేస్తూ విజయం సాధించింది.

అదే సినిమాను చిన్న చిన్న మార్పు చేర్పులతో ‘సుడిగాడు’ గా తెలుగులో రూపొందించారు. తెలుగునాట కూడా ఈ కామెడీ కొంత వరకూ ఆకట్టుకుంది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. తమిళనాట ‘తమిళ్ పాదం 2.0’ వచ్చేస్తోంది. చాన్నాళ్లుగా ప్రతిపాదనలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల అయిపోయింది. ఈ సారి కూడా సెటైర్లు ఉండబోతున్నాయని ఫస్ట్ లుక్ తోనే స్పష్టం చేసింది ఈ సినిమా. ఈ సారి టార్గెట్ రాజకీయాలు అయినట్టుగా ఉన్నాయి.

ఈ సినిమా ఫస్ట్ లుక్ లో నటుడు శివ ఇచ్చిన పోజు.. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంపై సెటైర్ లా ఉంది. ఆ మధ్య శశికళ, ఈపీఎస్ లపై యుద్ధం ప్రకటిస్తూ ఓపీఎస్ అమ్మ సమాధి వద్ద ధ్యానముద్రలో కూర్చుకున్నాడు కదా.. అదే రీతిన శివ ఇచ్చిన పోజును ఈ సినిమా ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. అసలే తమిళ రాజకీయాలు ఫుల్ కాక మీద ఉన్నాయి. ఒకరిద్దరు కాదు.. దాదాపు డజను మందికి పైగా నేతలు, సినిమా వాళ్లు తమిళ రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారు.

జయలలిత మరణించాకా తమిళ రాజకీయాలు మరీ కామెడీ కామెడీ అయిపోయాయి.. ఇలాంటి నేపథ్యంలో సెటైర్లకు బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. దీంతో.. తమిళ్ పాదం సీక్వెల్ పార్ట్ పై అందరి ఆసక్తీ నెలకొని ఉంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా దయానిధి అళగిరి రూపొందిస్తున్నాడు. ‘కిడ్స్ వెయిట్ ఫర్ 2.0, మెన్ వెయిట్ ఫర్ విశ్వరూపం 2, అండ్ లెజెండ్స్ వెయిట్ ఫర్ తమిళ్ పాద్ 2.0’ అంటూ.. సోషల్ మీడియా ఈ సెటైరికల్ సినిమాపై ఆసక్తిని ప్రదర్శిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?