Home > Movies - Movie Gossip
అర్జున్ రెడ్డి హీరోయిన్ కు క్రేజీ ఆఫర్

షాలిని పాండే... అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. అయితే తను అందరిలాంటి హీరోయిన్ ను కాదని అర్జున్ రెడ్డి రిలీజై టైమ్ లోనే చెప్పేసింది. స్వతహాగా థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో యాక్టింగ్ కు స్కోప్ ఉండే క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానని, గ్లామర్ రోల్స్ తనకు అక్కర్లేదని ఇంతకుముందే ప్రకటించింది.

ఇందులో భాగంగా ఓ క్రేజీ ఆఫర్ షాలిని పాండేను వరించింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మహానటి ప్రాజెక్టులో షాలిని పాండేను తీసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నాడట. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

మహానటి సినిమాలో సావిత్రి పాత్ర కోసం కీర్తిసురేష్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. మరో కీలకమైన పాత్ర కోసం సమంతను కూడా తీసుకున్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకున్న తర్వాత షాలినికి ఎలాంటి పాత్రను ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.