Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూపర్ హిట్ డైరక్టర్ కు హీరో దొరకట్లేదు

సూపర్ హిట్ డైరక్టర్ కు హీరో దొరకట్లేదు

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ ఇచ్చాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది శతమానంభవతి. పనిలోపనిగా ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇంతటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఇప్పుడు హీరో దొరకట్లేదు.

శతమానంభవతి సక్సెస్ తో మరో ఫ్యామిలీ ఓరియంటెడ్ కథ రాసుకున్నాడు వేగేశ్న. దీనికి శ్రీనివాస కల్యాణం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. శ్రీ వెడ్స్ నివాస్ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడు. కానీ ఈ స్టోరీలో నటించేందుకు హీరోలు ఎవరూ ముందుకు రావట్లేదని తెలుస్తోంది.

ఓ వైపు వేగేశ్నకు పెద్ద స్టార్ తో ఈ సినిమా చేయాలని ఉంది. కానీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసేందుకు బడా హీరోలెవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరోవైపు దిల్ రాజు దగ్గర నాని, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ డేట్స్ ఉన్నాయి. నాని ఇప్పటికే ఎంసీఏ సినిమాకు కమిట్ అయ్యాడు.

సాయిధరమ్ తేజ ఫ్యామిలీ కథలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అటు శర్వానంద్ కూడా మరోసారి ఫ్యామిలీ స్టోరీలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ మాత్రం కాస్త డైలమాలో ఉన్నాడట. వేగేశ్న కథపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?