Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శృతిహాసన్.. కొత్త ప్రియుడితో విహారం!

శృతిహాసన్.. కొత్త ప్రియుడితో విహారం!

చాన్నాళ్లుగా సింగిల్ స్టేటస్ లోనే ఉండిన శృతిహాసన్ ఇప్పుడు కొత్త ప్రేమకథకు శ్రీకారం చుట్టినట్టుంది. సిద్ధార్థ్ తో డేటింగ్ రిలేషన్ షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత కమల్ తనయ  ఎవరితోనూ ప్రేమాయణాలు నడిపిన దాఖలాలు హైలెట్ కాలేదు. బాలీవుడ్ హీరో రణ్ భీర్ కపూర్ కు సన్నిహితంగా మెలుగుతోందనే వార్తలు వచ్చినా.. ఆ ప్రచారం ఆదిలోనే ఆగిపోయింది.

తల్లి లేదా తండ్రితో కూడా ఉండని శృతి సొంత ఫ్లాట్ లో, ఒంటరిగానే ఉంటూ వచ్చింది ఇన్నాళ్లు. ఇప్పుడు ఆమెకు ఒక తోడు దొరికాడని సమాచారం. అతడి పేరు మైఖేల్ కొర్సేల్ అట. లండన్ కు చెందిన వ్యక్తి అట. పేరును బట్టి చూస్తే ఇటాలియన్ వాడులా ఉన్నాడే అని ఆరాతీస్తే.. అది నిజమే, ఇతడు ఇటాలియన్ వ్యక్తేనట. లండన్ లో ఉంటాడట. అక్కడే థియేటర్ కు సంబంధించిన ఏదో కోర్సు కూడా చేశాడట. మూవీ ఇండస్ట్రీతోనే మెలుగుతున్నాడట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శృతి, మైఖేల్ లు పరిచయం అయ్యారట. ఇప్పుడు సన్నిహితంగా మెలుగుతున్నారని భోగట్టా!

వీళ్లిద్దరూ కలిసి విహరిస్తున్న ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. అది కూడా వీళ్లు తరచూ కలిసి కనిపించడంతో.. ప్రేమ అనే మాట వినిపిస్తోంది. ఈ విషయం గురించి శృతి మేనేజర్లను సంప్రదించగా, ఇలాంటి విషయాలను మీడియాతో పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని  స్పష్టం చేశారు. మరి చూస్తుంటే.. కమల్ హాసన్ తనయ ప్రేమకథలా ఉంది ఇది. ఎంత వరకూ వెళ్తుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?