Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శింబూ పక్కా ‘ఏ’ సినిమాతో వస్తాడట!

శింబూ పక్కా ‘ఏ’ సినిమాతో వస్తాడట!

ఒక ‘ఏ’ కాదు... 'ట్రిపుల్ ఏ' సినిమా తీయనున్నాడట తమిళ హీరో శింబు. సినీ పరిభాషలో ‘ ఏ సినిమా’ అనే మాటకు ఉన్న ప్రత్యేకత ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. అడాల్ట్ ఓన్లీ కంటెంట్ ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. మరి అలాంటి ‘ఏ’ ని తన టైటిల్ లో మూడు సార్లు వాడుతూ “ ఏ ఏ ఏ’’ అనే టైటిల్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట శింబు.

మరి ఏమిటీ ఈ ట్రిబుల్ ఏ అంటే.. దానికి ఒక నిర్వచనం కూడా ఉంటుందట. హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసేలా “ఏ ఏ ఏ’ అక్షరాలకు వేరే నిర్వచనం ఉంటుందట. కానీ టైటిల్ మాత్రం ‘ ఏ ఏ  ఏ’ అంటూ హీటెక్కించేలా పెట్టుకొంటున్నాడు శింబు. అసలే శింబు ఈ మధ్య కాలంలో వరస వివాదాల్లో ఉన్నాడు. 

ఇతడి బీప్ సాంగ్ తో చాలా రచ్చ జరిగింది. ఆఖరికి ఆరెస్టులు.. వారెంట్లల వరకూ వెళ్లింది వ్యవహారం. మరి అ వివాదం అలా సద్దుమణిగిందో లేదో అప్పుడే శింబు  “ఏ ఏ ఏ’ అంటూ రెడీ కావడం విశేషం. మరి ఈ టైటిల్ ఎలాంటి వివాదం అవుతుందో.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?