Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సింహం..ఆవు..పాలు

సింహం..ఆవు..పాలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే మాటల మాంత్రికుడు అని పేరు. ఆయన తాజా సినిమా అ..ఆ రెడీ అవుతోంది. ఈ సినిమాలో కూడా హిలేరియస్ డైలాగులు ఎన్నో వున్నాయని టాక్. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ...'నేను సింహంలాంటోడ్ని..అది గెడ్డం గీసుకోదు..నేను గీసుకుంటా..అదొక్కటే తేడా..మిగతా అంతా సేమ్ టు సేమ్ ' అన్న డైలాగు గుర్తుందిగా..త్రివిక్రమ్ డైలాగుల్లో మహా పాపులర్ అది. అలాంటిదే ఇప్పుడు అ..ఆ లో కూడా వుందట.

ఆవు పాలిస్తుంది..సింహమూ పాలిస్తుంది...అన్నది ఆ డైలాగ్.. అంటే ఆవు పాలు ఇస్తుంది..సింహం అడవిని పాలిస్తుంది అన్న మీనింగ్ లో అన్నమాట.  కానీ త్రివిక్రమ్ కు తెలుసో లేదో..ఇలాంటి టైపే..ఆ మధ్య గుంటూరు టాడీస్ ప్రమోషన్ లో భాగంగా ఇంకోలా వాడారు..పాడలేవు అనేదాన్ని రేష్మి..పదేపదే..పాల్లేవు..పాల్లేవు..అంటూ వుంటుంది. 

మొత్తానికి త్రివిక్రమ్ పెన్ను మరెన్ని డైలాగులు కురిపిస్తుందో అ..ఆ లో..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?