Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శిష్యుడిని మించిపోతున్న గురువు

శిష్యుడిని మించిపోతున్న గురువు

తెలుగు సినిమా రంగంలో వేగంగా సినిమా చుట్టేయగల దర్శకుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు పూరి జగన్నాధ్. ఇప్పుడు అతగాడిని మించిపోతున్నాడు గురువు రామ్ గోపాల్ వర్మ. పైగా చాపకింద నీరులా రెండో కంటికి తెలియకుండా సినిమాలు తీసేస్తున్నాడు. రెండు వారాల్లో ఐస్ క్రీమ్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసేసాడు. అలాగే పట్టుమని పది రోజులు షూట్ చేసి, పట్టపగలు సినిమా పూర్తి చేసాడట. 

పైగా రౌడీ సినిమా దగ్గర నుంచి వర్మ కొత్త స్టయిల్ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో తానే ప్యాకేజీ మాట్లాడేసుకుని సినిమా పూర్తి తీసి చేతిలో పెట్టడం. పైగా పెద్ద అమౌంట్ కాదు. రిస్క్ వుండదు. వర్మ పేరు పబ్లిసిటీకి ఏడ్ అవుతుంది. రౌడీ పెద్దగా ఆడకున్నా నిర్మాతలు సేఫ్. ఇప్పడు ఐస్ క్రీమ్ కూడా సేఫ్ ప్రాజెక్టు. ఈ లెక్కన వర్మ దగ్గరకు చిన్న, పెద్ద నిర్మాతలు రెండు కోట్లు వుంటే చాలు సినిమాకు రెడీ అయిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?