Home > Movies - Movie Gossip
స్కిన్ దళసరి కావాలి వరుణ్

టాలీవుడ్ లో కాస్త థిక్ స్కిన్ లేకపోతే బతకడం కష్టం. అంతే కానీ, ఒక్క సినిమా ఫ్లాప్ అయితే, కొన్నాళ్ల పాటు పబ్లిక్ లోకి రాలేను అనుకుంటే కష్టం. వరుణ్ తేజ మంచి నటుడు, మిగిలిన మెగా హీరోల్లా కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి వాడు ఎలా పడ్డాడో, పాపం శ్రీను వైట్ల వలలో పడి, మిస్టర్ సినిమా చేసాడు. అటు నిర్మాతలు పాతిక కోట్లకు కుదేలయ్యారు శ్రీను వైట్ల పుణ్యమా అని. అలాగే ఇప్పటిదాకా కెరీర్ లో ప్రశంసలే తప్ప, వేరు తెలియని వరుణ్ తేజ తొలిసారి భయంకరమైన సినిమా చేసిన విమర్శలు ఎదుర్కొన్నాడు.

దీంతో ఇప్పుడు వరుణ్ కాస్త ముడుచుకుపోయినట్లు ఫీలవుతున్నాడట. బయట పబ్లిక్ లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నట్లు వినికిడి. మొన్నటికి మొన్న ఓ అడియో ఫంక్షన్ కు ఎంత రమ్మని బతిమాలినా, సారీ చెప్పాడట తపా, ఓకె అనలేదట. తన మనసు బాలేదని, ఇప్పుడు పబ్లిక్ లోకి, మీడియా ముందుకు రాలేనని, అడిగిన వారికి సారీ చెప్పాడట.

ఇలా అయితే కాస్త కష్టమే. సినిమాలు హిట్, ఫట్ కామన్. చేసుకుంటూ వెళ్లిపోవడమే. సాయి ధరమ్ తేజకు అనుభవం జరిగి, తత్వం బోధపడినట్లు, వరుణ్ కు జరిగినట్లు లేదు. కొంచెం టైమ్ పడుతుంది.