Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సోమవారం షాకిచ్చింది

సోమవారం షాకిచ్చింది

అనుకున్నంతా అయింది. శుక్ర, శని, ఆది వారాలు దులిపేసిన ఆగడు సినిమా సోమవారం చతికిలపడిపోయింది. కేవలం కోటి రూపాయిల కలెక్షన్లతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొగుడు కోట్టినందుకు కాదు, తోటికోడలు దెప్పినందుకు అన్నట్లు నైజాంలో తమ సినిమా కలెక్షన్లు ఎలా అఘోరించినా, తమకన్నా ఓ పావలా ఎక్కువే కలెక్ట్ చేసింది రవితేజ పవర్ అని తెలిసి ఆగడు యూనిట్ నివ్వెర పోతోందట. 

నైజాం మొత్తం మీద నలభై లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ నిలదీస్తుండడంతో శ్రీను వైట్ల మరి ఇంక చానెళ్లకు వెళ్లడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. వెబ్ మీడియా ఎలాగూ దాని చిత్తానికి అది రాస్తుంది కాబట్టి, దానిని వదిలేసి, ఇప్పుడు యూనిట్ అంతా ప్రింట్ మీడియా వెనుక పడ్డారు. విడుదలకు ముందు మీడియా అంటే తెలియనట్లు కాలక్షేపం చేసేసి, తమకు కావాల్సిన వారిని మాత్రం కలిసేసిన అనిల్ సుంకర, అండ్ కో ఇప్పుడు పబ్లిసిటీకి మార్గాలు వెదుకుతున్నారు. 

దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భం కలిసి వచ్చింది కనుక, మీడియాను ఓ సారి కలిసి,సినిమా గురించి వాయించారు. ఈ జాగ్రత్తలేవో సినిమా విడుదలకు ముందు వుంటే బాగుండేది. ఈ లెక్కన వసూళ్లు వుంటే అతికష్టం మీద నలభై కోట్ల క్లబ్ దాకా డేకడం తప్ప, అంతకన్నా ఫలితం వుండకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?