Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ బెంగ తీరిపోయినట్లే

స్పైడర్ బెంగ తీరిపోయినట్లే

విజువల్ గ్రాఫిక్స్ వర్క్స్ పుణ్యమా అని ఎక్కడో ప్రారంభమై ఎక్కడికో చేరింది స్పైడర్. తెలుగులో నాన్ బాహుబలి రికార్డు పెట్టుబడి పరంగా స్పైడర్ దే. ఇంత భారీ వ్యయంతో బాహుబలి తరువాత తయారైన సినిమా ఇదే. 125కోట్ల పెట్టుబడి. భారీ సినిమాలు చాలా వచ్చాయి కానీ, మేకింగ్ కు ముఫై నుంచి యాభై ఖర్చు చేసి, వంద కోట్ల మార్కెట్ చేసుకున్నవే తప్ప, వంద కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమా ఇదే. 

అయితే ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చినా పోటీ తప్పలేదు. వారం ముందుగా ఎన్టీఆర్ భారీ సినిమా జై లవ కుశ విడుదల ఫిక్సయింది. అది చాలదన్నట్లు, స్పైడర్ వచ్చిన రెండు రోజులకే మరో చిన్న సినిమా మహానుభావుడు విడుదల ఫిక్సయింది. మామూలుగా అయితే మహానుభావుడు లాంటి సినిమాను పట్టించుకోరు. కానీ మారుతి డైరక్టర్ కావడం, యువి లాంటి బ్యానర్ నుంచి రావడం, శర్వానంద్ హీరో కావడంతో ఆ సినిమా కు కూడా ఓ అయిడెంటిటీ వచ్చింది. 

దీంతో స్పైడర్ కు కాస్త సమస్యే అనుకున్నారు అంతా.  జై లవకుశ ఫస్ట్ వీక్ దాని డబ్బులు అది తెచ్చుకోవడం స్పైడర్ కు సమస్య కాదు. కానీ జై లవకుశ బ్లాక్ బస్టర్ అయితే ఆ ఎఫెక్ట్ స్పైడర్ మీద పడుతుందని, దసరా వసూళ్లు పంచుకోవాల్సి వస్తుందిని లెక్కలు కట్టారంతా. అదే సమయంలో స్పైడర్ టాక్ తేడా వస్తే, జై లవకుశ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుతుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు జై లవకుశ కు వచ్చిన టాక్ వన్ వీక్ తరువాత స్పైడర్ కు ఎఫెక్ట్ ఇచ్చే రేంజ్ లో లేదు. అది వాస్తవం. పైగా ఇబ్బడి ముబ్బడిగా థియేటర్లు తీసుకోవడం, ఎక్కువ షో లు, స్క్రీన్ లు వేయడం, గురువారమే విడుదల కావడం వల్ల, తొలి ఆరు రోజుల్లోనే మాగ్జిమమ్ రెగ్యులర్ ఆడియన్స్ కవర్ అయిపోతారు. దాంతో స్పైడర్ విడుదల నాటికి మళ్లీ రెడీ అయిపోతారు.

అందువల్ల స్పైడర్ ఓపెనింగ్స్ కు కానీ, పస్ట్ వీక్ కలెక్షన్ కు కానీ పెద్దగా సమస్య వుండదు. ఇక బాల్ స్పైడర్ కోర్టులోకి చేరినట్లే. ఆ సినిమా వల్ల, లేదా ఈ పోటీ వల్ల తేడా వచ్చింది అని ఇక చెప్పుకోవడానికి లేదు. స్పైడర్ సినిమా బాగా ఆడడం అన్నది ఇక స్పైడర్ చేతిలోనే వుంది. సినిమా బాగుండాలి. అంతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?