Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ కు యు/ఎ

స్పైడర్ కు యు/ఎ

దసరా బరిలోని మరో సినిమా స్పైడర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇదే బరిలో దిగుతున్న జై లవకుశ సెన్సారు గతవారం పూర్తయిన సంగతి తెలిసిందే. స్పైడర్ ను సెన్సారు ముందుకు సోమవారం తీసుకువచ్చారు. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సినిమా మొత్తం రన్ టైమ్ రెండు గంటల 25 నిమషాలు వచ్చింది. పెద్దగా కట్స్ ఏమీ పడలేదు.

స్పైడర్ సినిమా ఈ నెల 27న విడుదలవుతుంది. మురుగదాస్, సంతోష్ శివన్, హారిష్ జయరాజ్ లాంటి హేమా హేమీ టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమా మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా కొసం భారీగా విఎఫ్ఎక్స్ పనులు నిర్వహించారు. రష్యా, యుకె తదితర ప్రాంతాల్లో ఈ పనులు చేయించడం విశేషం. బయో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో స్పైడర్ కథ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?