Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ నిడివి 2.20 నిమషాలే

స్పైడర్ నిడివి 2.20 నిమషాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏస్ డైరక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా స్పైడర్. ఈ సినిమా టాకీ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చురుగ్గా సాగుతోంది. ప్రస్తుతం చెన్నయ్ లో రీరికార్డింగ్ పని జరుగుతోంది. తొలిసగం ఎడిటింగ్ పూర్తి చేసి, ఒకటి రెండు సార్లు చెక్ చేసి, నిడివిని దర్శకుడు మురుగదాస్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసగం గంటా 13నిమషాలు వచ్చింది. ఫైన్ ట్యూన్ చేసి గంటా పది నిమషాలకు సెట్ చేసుకున్నారట.

రెండో భాగం కూడా ఇంతే వస్తుందని తెలుస్తోంది. రెండు నెలలు టైమ్ వుంది విడుదలకు. దాంతో సినిమా లెంగ్త్, రన్నింగ్ విషయంలో ఎటువంటి కంప్లయింట్స్ వుండకూడదని డిసైడ్ అయ్యారట మురగదాస్. మహేష్ మినహా మిగిలిన అందరి డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. అందువల్ల మురగదాస్ కు పెద్దగా పని మిగిలలేదు. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారట కాపీని. 

టోటల్ గా సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమషాలు వుంటుందట. పెద్ద హీరో, పెద్ద డైరక్టర్ సినిమా అంటే ఆ మాత్రం నిడివి అంటే పెర్ ఫెక్ట్ గా వున్నట్లే అనుకోవాలి. స్పైడర్ సినిమా టీజర్ మహేష్ బర్త్ డే నాడు విడుదలవుతుంది. సినిమా దసరాకు సెప్టెంబర్ 27న విడుదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?