Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ పై మరీ ఇంత కుట్రనా?

స్పైడర్ పై మరీ ఇంత కుట్రనా?

స్పైడర్ సినిమా. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న భారీ సినిమా. నూట ఇరవై కోట్ల బడ్జెట్. నూట ముఫై కోట్ల కు పైగా అమ్మకాలు. ఎంతటి అంచనాలు. ఎంత మార్కెట్. వీటన్నింటినీ దెబ్బతీసే ప్రయత్నం భయంకరంగా జరిగింది. ట్రయిలర్ విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందుగా లీక్ చేసేసారు. ప్రొడ్యూసర్ టాగోర్ మధు కాపీనే లీక్ అయిందని వాటర్ మార్క్ చెబుతోంది. లీక్ అయింది యూ ట్యూబ్ లింక్ కాదు. నేరుగా విడియో కాపీనే. అంటే అయితే చెన్నయ్ నుంచి లేదా హైదరాబాద్ లోని స్పైయిడర్ ఆపీసుల నుంచే లీక్ అయి వుండాలి.

సరే, లీక్ అవ్వడం అన్నది సినిమాలకు కొత్త కాదు. కానీ సరిగ్గా ట్రయిలర్ విడుదలకు కొన్ని గంటల ముందు లీక్ చేసారు అంటే. కావాలనే జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది. ఒక్క ఎన్టీఆర్-మహేష్ అభిమానుల మధ్య పోటీ భయంకరంగా వుంది. ఎన్టీఆర్ జై లవకుశ కు కొటికి పైగా వ్యూస్ వచ్చాయి. మరి స్పైడర్ కు కూడా ఆ రేంజ్ లో రాకుంటే అభిమానులు ఫీలవుతారు. ట్రయిలర్ దాని టైమ్ లో, దాని ప్రచారంతో అది వస్తే, వచ్చే వ్యూస్ వేరు. ఇలా లీకుల బారిన పడితే వచ్చే వ్యూస్ వేరు.

ఎక్కడ జరిగింది అన్నది కనిపెట్టడం, పట్టుకోవడం, ఇవన్నీ ఓ ప్రాసెస్.కానీ అది కాదు విషయం.  సినిమా అన్నపుడు కొన్ని పదుల సంఖ్యలో జనాలను అయినా నమ్మక తప్పని పరిస్థితి. మరి ఇలా వెన్నుపోట్లు, లీకులు అనివార్యం అయిపోతుంటే, భారీ సినిమాలను తలకెత్తుకునే నిర్మాతల పరిస్థితి ఏమిటి? స్పైడర్ సినిమా తెలుగు వెర్షన్ ప్రచారానికి భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శుక్రవారం ప్లాన్ చేసారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ లో కీలక ఘట్టం అయిన ట్రయిలర్ విడుదల అన్నది లేకుండా అయిపోయింది.

ఇదిలా వుంటే రెండు వెర్షన్లు తలకెత్తుకోవడం వల్లనే ఈ సమస్య అని మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు. తమిళ వెర్షన్ కూడా టేకప్ చేయడం, మురుగదాస్ చెన్నయ్ లో వుండడంతో, ప్రతీదీ చెన్నయ్ లోనే రెడీ చేస్తున్నారు. ప్రతీదీ ఇటు అటు తిరగాల్సి వస్తోంది. దాంతో ప్రచారంలో డిలే అనివార్యం అవుతోంది. అదే సమయంలో ఇలాంటి లీకులు తప్పడం లేదు.

ఇది అత్యుత్సాహంతో చేసారా? కుట్రనా? అన్న సంగతి అలా వుంచితే, సినిమాకు జరిగే డ్యామేజ్ పెద్దగా ఏమీ వుండదు. జస్ట్ ట్రయిలర్ కు వచ్చెే వ్యూస్ కు మాత్రమే సమస్య.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?