Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ సెకెండ్ టీజర్ రెడీ

స్పైడర్ సెకెండ్ టీజర్ రెడీ

మహేష్ బాబు-మురగదాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న స్పైడర్ సినిమా ప్రచార వ్యవహారాలకు తెర తీస్తున్నారు. ఫస్ట్ విడుదల చేసిన టీజర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈసారి మరి కాస్త డిటైల్డ్ టీజర్ ఒకటి వదలాలని డిసైడ్ అయ్యారు.

ఇది కేవలం మొదటి టీజర్ లా కాకుండా, సినిమా కోసం చిత్రీకరించిన కంటెంట్ వాడాలని ప్లాన్ చేస్తున్నారు. తొలి టీజర్ ను కేవలం టీజర్ కోసం చిత్రీకరించిన షాట్ తో వదిలారు. రెండో టీజర్ అలా కాకుండా సినిమా కోసం తీసిన షాట్ తో వదిలేందుకు డిసైడ్ అయ్యారు.

జూలై రెండో వారంలో ఈ రెండో టీజర్ వదిలి, ఆగస్టు 9న ట్రయిలర్ వదుల్తారు. అప్పటికి సినిమా విడుదలకు నెలా ఇరవై రోజులు గ్యాప్ వుంటుంది. ఈ టైమ్ అంతా ప్రచారానికి వాడతారు.

ఇటు ఆంధ్ర, అటు తమిళ నాట, కొద్దిగా బాలీవుడ్ లో కూడా మహేష్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాకు హారిష్ జయ్ రాజ్ సంగీతం ఓ స్పెషల్ అవుతుందని భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?