Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్‌ సైలెంట్‌గా కొట్టేస్తాడా?

స్పైడర్‌ సైలెంట్‌గా కొట్టేస్తాడా?

బాహుబలి తర్వాత వచ్చిన భారీ చిత్రాలు నిరాశ పరుస్తూ పోతుంటే చిన్న సినిమాలే ఘన విజయాలు అందుకుంటున్నాయి. జై లవ కుశ కూడా అంచనాలని అందుకోలేదని ఇనీషియల్‌ రిపోర్ట్స్‌ని బట్టి అర్థమవుతోంది. సినిమాపై వున్న అంచనాల వల్ల ఆరంభ వసూళ్లకి ఢోకా వుండదు కానీ లాంగ్‌ రన్‌ వుంటుందా లేదా అనేది చూడాలి.

ట్రెయిలర్స్‌తో ప్రామిసింగ్‌గా కనిపించిన జై లవకుశ ఇంత నీరసంగా తెరకెక్కడం ఆశ్చర్యపరచింది. ట్రెయిలర్స్‌తో అంతగా మెప్పించలేకపోయిన 'స్పైడర్‌' మాత్రం అంచనాలని చెక్‌లో పెట్టేసింది. మహేష్‌ చిత్రం కనుక ఓపెనింగ్‌కి ఏ సమస్య వుండదు కానీ స్పైడర్‌ అయినా మెప్పిస్తుందా లేదా అనేది తెలియాలి. ఇన్‌సైడ్‌ టాక్‌ బట్టి సెకండ్‌ హాఫ్‌ బాగుంటుందని, మహేష్‌-సూర్య మధ్య నడిచే వార్‌ ఆసక్తికరంగా వుంటుందని తెలిసింది.

ట్రెయిలర్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన స్పైడర్‌ తక్కువ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్‌ విజేతగా నిలుస్తుందా? మహేష్‌, మురుగదాస్‌ ఇద్దరూ కూడా ఈచిత్రంపై అచంచలమైన నమ్మకంతో వున్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?