Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్టయిలిష్‌ గోపీచంద్‌

స్టయిలిష్‌ గోపీచంద్‌

గోపీచంద్‌ అంటే మాస్‌ ఎంటర్‌టైనర్సే తప్ప అతడిని స్టయిలిష్‌గా చూపించడానికి దర్శకులు అంతగా ట్రై చేయలేదు. మొదటిసారి గోపీలో స్టయిలిష్‌ యాంగిల్‌ని చూపిస్తున్నాడు కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. ‘జిల్‌’ చిత్రం టీజర్‌లో స్టయిలిష్‌ గోపీతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. 

హీరోలకి కొత్త లుక్‌ ఇవ్వడంలో యు.వి. క్రియేషన్స్‌ తమదైన ముద్ర వేస్తోంది. మిర్చిలో ప్రభాస్‌, రన్‌ రాజా రన్‌లో శర్వానంద్‌ ఇద్దరూ కెరీర్‌ బెస్ట్‌ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు గోపీచంద్‌ కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్‌ నుంచి కోరుకునే యాక్షన్‌తో పాటు వినోదానికి కూడా లోటుండదట. 

మార్చి 12న జిల్‌ ఆడియో రిలీజ్‌ చేస్తున్నారు. రన్‌ రాజా రన్‌లో డిఫరెంట్‌ మ్యూజిక్‌తో అలరించిన ఘిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. మార్చి 27న జిల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. లౌక్యంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన గోపీచంద్‌ దీంతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?