Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుమంత్ అశ్విన్ తో నీహారిక

సుమంత్ అశ్విన్ తో నీహారిక

నీహారిక కొణిదెల ఒక మనసు సినిమా చేసిన తరువాత మళ్లీ పెద్ద స్క్రీన్ మీద కనిపించలేదు. ఏం చేస్తుందా? ఏం చేస్తుందా? అని కొన్నాళ్లు ఊహాగానాలు వినిపించి, ఆఖరికి ఆగిపోయాయి. ఇప్పుడు, ఇన్నాళ్లకు మరో సినిమా ఫిక్సయింది. అసలు సినిమాలే వదిలేసాడమో అన్నంత అనుమానం వచ్చేలా, తెరపై నుంచి మాయమైన హీరో సుమంత్ అశ్విన్ సరసన నటించబోతోంది.

సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తో కలిసి పాకెట్ సినిమా అనే కొత్త సంస్థ ఈ కాంబినేషన్ ను సెట్ చేసింది. లక్ష్మణ్ కార్య అనే కొత్త దర్శకుడు రూపొందించే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నీహారిక పాత్ర కూడా కీలకంగా వుంటుందట. అందుకే కథ వినగానే సుమంత్ అశ్విన్ సరసన చేయడానికి నీహారిక ఓకె చేసినట్లు వినికిడి.

దేవీశ్రీప్రసాద్, బాల్ రెడ్డి తదితరులు సాంకేతిక సహకారం అందించే ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?