Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుందరపాండ్యన్...ఎక్కడ?

సుందరపాండ్యన్...ఎక్కడ?

సునీల్ తో సినిమా అంటే చాలు ఎందుకో టాలీవుడ్ జనాలు వెనుకంజ వేస్తున్నారు. మారుతి సినిమా అబేయన్స్ లో వుంది..దిల్ రాజు సినిమాదీ అదే తీరు. ఇక ఎప్పుడో ఏడాది క్రితం హక్కులు కొన్నాడు భీమినేనితో కలిసి రంజిత్ మూవీస్ వారు..సుందర్ పాండ్యన్ సినిమావి. దీన్ని సునీల్ తో తీయాలన్నదే సంకల్పం. కానీ ఆ ప్రాజెక్టు మొదలే కావడం లేదు. 

సునీల్ కు ఇచ్చే మూడు కోట్ల పారితోషికం, డబ్బింగ్ రైట్స్ , నిర్మాణం కలిపి 10 నుంచి 12 వరకు అవుతోందని అంచనా వేసుకున్నారు నిర్మాతలు. కానీ సునీల్ తో అంత అయితే వర్కవుట్ అవదని కిందా మీదా పడుతున్నారు. సునీల్ తన రేటు తగ్గించడు. మారుతికీ ఇదే సమస్య ఎదురయింది. సునీల్ రేటు తగ్గదు..ఆ రేంజ్ వర్కవుట్ అవ్వదు..మరెలా..?సుందర్ పాండ్యన్ అందుకే హక్కులు కొనడం దగ్గరే ఆగిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?