Home > Movies - Movie Gossip
ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఇంతకీ ఎవరికి?

సింగిల్ టైటిల్ తో ఆసక్తి రేకెత్తిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. తాజాగా ఈ బ్యానర్ 'అమర్-అక్బర్-ఆంటోనీ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. టైటిల్ చాలా వెరైటీగా ఉంది. కాకపోతే ఇది ఏ హీరోకు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు వీళ్లు ఆల్రెడీ టైటిల్స్ ఫిక్స్ చేశారు. త్వరలోనే చేయబోయే సినిమాలకు హీరోలు ఫిక్స్ కాలేదు. అందుకే ఈ టైటిల్ పై అంత సస్పెన్స్. శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో ఈ బ్యానర్ లో ఓ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ మూవీకే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

మరోవైపు దర్శకుడు సందీప్ వంగకు అడ్వాన్స్ ఇచ్చింది ఈ బ్యానర్. మరోవైపు పవన్ కల్యాణ్ తో సినిమా చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ను రంగంలోకి దించారట. ఈ నేపథ్యంలో 'అమర్-అక్బర్-ఆంటోనీ' టైటిల్ ఏ ప్రాజెక్టుకు ఫిక్స్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.