Home > Movies - Movie Gossip
స్వాతి ముత్యం అవసరాల?

కామెడీ అంటే స్పూఫ్ లే అని అనుకునే స్టేజ్ కు దిగారు చాలా మంది తెలుగు సినిమా రచయితలు, దర్శకులు. అయితే ఇంకా కొంతమంది మంచి దర్శకులు ఇలాంటి వ్యవహారాలకు దూరంగా వున్నారన్న ఆనందం మిగిలి వుంది. కానీ లేటెస్ట్ గా అమీతుమీ ట్రయిలర్ చూస్తే, ఇలాంట ఆనందం కాస్తా ఆవిరయ్యే ప్రమాదం వుంది. 

ఇంద్రగంటి మోహనకృష్ణ క్లాస్ కామెడీ అందించగల సత్తా వున్న డైరక్టర్. అలాంటి డైరక్టర్ కూడా సరదాకో, జనాల కోసమో, చిన్న స్పూఫ్ ను ట్రయ్ చేసినట్లుంది. అమీతుమీ ట్రయిలర్ లో నటుడు అవసరాల శ్రీనివాస్ జస్ట్ ఓ మెరుపులా స్వాతిముత్యం కమల్ హాసన్ గెటప్ లో కనిపించారు. చేతిలో ఏక్ తారా పట్టకుని, మొహాన అడ్డ బొట్టు పెట్టుకుని, అదే కలర్ డ్రెస్ తో కనిపించారు. అంటే మరి, పాటలో జస్ట్ ఓ సరదా కోసం ఈ స్ఫూఫ్ ట్రయ్ చేసారో లేక, ఇంకా ముందుకు వెళ్లారో సినిమా వస్తే కానీ తెలియదు.