Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్విట్జర్లాండ్ లో పవన్ పాటలు

స్విట్జర్లాండ్ లో పవన్ పాటలు

కాటమరాయుడు కు సంబంధించి ఇక మూడు పాటలు మిగిలాయి. ఒక పాట ఈరోజుతో ఆర్ఎఫ్సీలో పూర్తయింది. అయితే రెండు డ్యూయట్లు, ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మిగిలాయి. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చేసేస్తారు. అంతకు ముందు రెండు డ్యూయట్లను విదేశాల్లో చిత్రీకరిస్తారు. ఈ డ్యూయట్ల కోసం స్విట్జర్లాండ్, ఆ పరిసర ప్రాంతాలను లోకేషన్లుగా ఎంచుకున్నారు. 

సినిమా విడుదలకు మార్చి ధర్డ్ వీక్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఇక సెకండాఫ్ వుంది. ప్లస్ మూడు పాటలు వున్నాయి. 10లోగా ఈ పనులు అన్నీ పూర్తి చేసి, 15 నాటికి సెన్సారు కాపీ రెడీ చేయాలన్నది యూనిట్ టార్గెట్ అంట. 

ఇదిలా వుంటే కాటమరాయుడు మాతృక తమిళ్ సినిమా కావడంతో జనాలకు అందరికీ దాని కథ తెలిసిందే. అయితే దర్శకుడు డాలీ సినిమాలో కాస్త లైటర్ వీన్ ప్లస్ క్లాస్ టచ్ కామెడీని, కాస్త క్లాస్ రొమాన్స్ సీన్స్ ను చేర్చారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?