Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా: మరో నెల రోజులు వాయిదా

సైరా: మరో నెల రోజులు వాయిదా

లెక్కప్రకారం ఈనెలాఖరు నుంచి ప్రారంభంకావాలి సైరా నరసింహారెడ్డి ప్రాజెక్టు. కానీ చిరంజీవి 151వ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదాపడింది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారం నుంచి ఇది సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. చిరంజీవి లుక్ మారుతోందనే వార్తల మధ్య ఇలా షూటింగ్ వాయిదాపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు మరికొన్ని కారణాలు ఉండనే ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో రత్నవేలును డీవోపీగా తీసుకున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు రెహ్మాన్ కూడా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రెహ్మాన్ బయటకుపోకుండా రామ్ చరణ్ బుజ్జగించినట్టు తెలుస్తోంది. 

దీంతో పాటు ప్రధాన తారాగణానికి సంబంధించిన కొంతమంది కాల్షీట్లు కూడా అందుబాటులోకి రాలేదు. అందుకే భారీ సెట్స్ రెడీ అయినప్పటికీ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఈ నెల రోజుల్లో రంగస్థలం సినిమాను పూర్తిచేసి, కంప్లీట్ గా సైరా సినిమాపైనే దృష్టిపెట్టాలని నిర్ణయించాడు రామ్ చరణ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?