Home > Movies - Movie Gossip
సైరా కోసం అమెజాన్ ఏర్పాట్లు

సైరా సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ, సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమాకు తీసుకునే నటులు, సాంకేతిక నిపుణుల సంగతి ఇప్పటికే తెలిసిందే. అది కాకుండా, సైరా సినిమా ప్రారంభానికి ముందే అమెజాన్ సంస్థతో ఓ ఒప్పందం కుదిరిందని గతంలో వార్తలు వచ్చేసాయి.

సైరా వర్కింగ్ విడియోల డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6నుంచి సైరా షూట్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా అమెజాన్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

సైరా సినిమా షూటింగ్ మేకింగ్ విడియోల కోసం తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన ఎక్విప్ మెంట్, తన సిబ్బందిని తాను ఏర్పాటు చేసుకుంటోందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ తరహా ప్రయోగం ఇదే ప్రథమం అవుతుంది.

ఓ పెద్ద సినిమా విషయమై ఏం జరుగుతోంది అన్నది ఇకపై అధికారికంగా అమెజాన్ వంటి సైట్ల ద్వారా బయటకు వచ్చే అవకాశం వుంటుంది. అయితే అమెజాన్ ఈ మేకింగ్ విడియోలను ఎప్పుడు లోడ్ చేస్తుందన్నది తెలియదు. మెగాక్యాంప్ కు అమెజాన్ కు మధ్య కుదిరిన ఒప్పందంపై ఆధారపడి వుంటుంది ఇది.

అదే కనుక సినిమా నిర్మాణంలో వుండగా అడపదడపా వదిలితే కనుక, సినిమాకు వచ్చే బజ్ ఓ రేంజ్ లో వుంటుంది.