Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా లో కూడా 'అతడికి' ప్లేస్?

సైరా లో కూడా 'అతడికి' ప్లేస్?

దర్శకుడు దాసరి నారాయణరావు తీరిన కోరిక ఏదయినా వుంటే, అది ఆయన తన కొడుకును మంచి నటుడిగా చూడడమే. ఎందుకో దాసరి అరుణ్ కుమార్ పెద్దగా క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు శిరీష్-యువి ఆనంద్ కాంబినేషన్ లో తయారైన ఒక్క క్షణం సినిమాలో విలన్ పాత్రను పోషించాడు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ సినిమా సైరాలో కూడా దాసరి అరుణ్ కుమార్ ను ఓ పాత్రకు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ గెటప్ ను అరుణ్ కుమార్ తో ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ గెటప్, ఆ పాత్ర అరుణ్ కుమార్ కు సూట్ అయితే సైరాలో నటించడం పిక్స్ అయిపోతుంది. 

ఒకటి రెండు సినిమాలు క్లిక్ అయితే చాలు అరుణ్ కుమార్ సెట్ అయిపోయే అవకాశం వుంటుంది. ఆది పినిశెట్టిని విలన్ గా మార్చి నిలబెట్టిన మెగా క్యాంప్ అరుణ్ కుమార్ ను కూడా నిలబెట్టేలాగేవుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?