Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎందుకో.. ఫ్లాఫ్ అని తెలిసినా విడుదల!

ఎందుకో.. ఫ్లాఫ్ అని తెలిసినా విడుదల!

డబ్బింగ్ సినిమాల విషయంలో ఒక ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. ఒరిజినల్ గా ఆ సినిమా రూపొందిన భాషలో అది హిట్ అయితే.. మరో భాషలోకి దాన్ని తర్జుమా చేసి విడుదల చేసుకోవచ్చు. అయితే ఇంత తెలివిగా వ్యవహరించేలా లేరు సినీ నిర్మాతలు. ఏదో విధంగా డబ్ చేసి ప్రేక్షకుల మీదకు వదలడమే కథ.

ఆఖరికి తెలుగులో రూపొంది, ఏ తమిళంలోనో, కన్నడలోనే సదరు సినిమా రీమేక్ అయ్యాకా.. ఆ రీమేక్ ప్రాజెక్టును మళ్లీ తెలుగులోకి అనువదించేసి ప్రేక్షకుల మీదకు వదిలేసే సంప్రదాయాలు మన దగ్గర కొనసాగుతున్నాయి. ఇలాంటి లొల్లిలో ఇప్పుడు మరో సూపర్ ఫ్లాప్ తమిళ బొమ్మ తెలుగులోకి అనువాదం అయ్యి ఈ వారమే విడుదల కాబోతోంది.

ఇదే విక్రమ్ సినిమా ‘10 ఎండ్రాదుకుల్లా’. తెలుగులో చెప్పాలంటే.. ‘పది లెక్కపెట్టేలోపు’. ఈ సినిమా కొత్తది ఏమీకాదు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తమిళంలో విడుదల అయ్యి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. తమిళంలో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బతో అప్పట్లో దీన్ని తెలుగులోకి అనువదించే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు.

ఏమైందో ఏమోకానీ.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు. ఈ వారంలోనే విడుదల కూడానట. విక్రమ్, సమంత పేర్ల మీద ఈ సినిమా మార్కెట్ అవుతుందా? అంటే.. సరైన ప్రచారం కూడా లేదు. బహుశా ఏ శాటిలైట్ రైట్స్ కోసమో అనువదించినట్టుగా ఉన్నారు. అయినా శాటిలైట్ విషయంలో కూడా టీవీ చానళ్లు అమాయకత్వంతో ఏమీలేవు. బోలెడన్ని డబ్బింగ్ స్టార్ల సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోని పరిస్థితి ఉంది సుమా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?