Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తరుణ్ కు బ్యాండ్ తప్పదా..?

తరుణ్ కు బ్యాండ్ తప్పదా..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా మరికాసేపట్లో సినీనటుడు తరుణ్ సిట్ విచారణకు హాజరుకాబోతున్నాడు. నటుడు సుబ్బరాజును నిన్న దాదాపు 13 గంటల పాటు విచారించిన నేపథ్యంలో ఈరోజు తరుణ్ కు చుక్కలు కనిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. 

నిజానికి తరుణ్ పై డ్రగ్స్ ఆరోపణలు ఇప్పటివి కాదు. చాలా ఏళ్లుగా ఈ నటుడిపై అలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఇలా విచారణకు హాజరవ్వలేదు తరుణ్. మరీ ముఖ్యంగా ఈ హీరోకు సిటీలో పబ్స్ కూడా ఉండడంతో ఈరోజు విచారణ కాస్త గట్టిగా సాగే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ విషయంలో కూడా తరుణ్ కాస్త వీక్ కాబట్టి.. సిట్ అధికారులు ఓ ఆట ఆడుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. 

సుబ్బరాజును సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు అతడి నుంచి కీలకమైన సమాచారంతో పాటు అనేక కొత్త విషయాల్ని సేకరించారట. వాటి ఆధారంగా తరుణ్ ను ప్రశ్నించడం కోసం రాత్రికి రాత్రి ప్రశ్నలు మార్చారట. లిస్ట్ చాలా పెద్దదయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిట్ కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్న తరుణ్.. మళ్లీ ఎప్పుడు బయటకొస్తాడనేది అందర్లో ఉన్న డౌట్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?