Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎంసీఏ కూడా తెలంగాణలోనే..!

ఎంసీఏ కూడా తెలంగాణలోనే..!

ఓ ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలంటే హైదరాబాద్ లో పెడదామా లేక విశాఖ/విజయవాడలో పెడదామా అని తెగ ఆలోచిస్తుంటారు సినిమావాళ్లు. దిల్ రాజు మాత్రం తెలంగాణలో ఏదైనా ఓ పట్టణంలో పెట్టేద్దాం అంటాడు. మొన్నటికి మొన్న ఫిదా విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఎంసీఏ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. 

ఎంసీఏ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వరంగల్ లో ప్లాన్ చేశారు. ఈనెల 16న వరంగల్ లో ఎంసీఏ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. అయితే ఇలా వరంగల్ ను సెలక్ట్ చేసుకోవడం వెనక ఓ కారణం ఉంది. ఎంసీఏ సినిమా మొత్తం వరంగల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. చాలా సన్నివేశాలు అక్కడే తీశారు. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం వరంగల్ ను వేదికగా ఎంచుకున్నారు.

ఫిదా విషయంలో కూడా అదే చేశాడు దిల్ రాజు. బాన్సువాడలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అందుకే ఆ సినిమా ఫంక్షన్ ను బాన్సువాడలో సెలబ్రేట్ చేశాడు. ఇక ఎంసీఏ విషయానికొస్తే ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నారు. వదిన-మరిది మధ్య వచ్చే ఎమోషనల్ ఎటాచ్ మెంట్ తో ఎంసీఏ సినిమాను తెరకెక్కించారు. వదినగా భూమిక నటించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?