Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలివైన పని చేస్తున్న నాగ్

తెలివైన  పని చేస్తున్న నాగ్

మాంచి బజ్ రప్పించుకుని, వేయి థియేటర్లలో విడుదల చేసి, మూడు రోజులు, వీలైతే వారంరోజుల్లో సినిమాను సోమ్ము చేసుకోవడం అన్నది పెద్ద సినిమాలకు ఆనవాయతీగా మారింది. ఇలాంటి టైమ్ లో నిర్మాతగా నాగార్జున డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. తన కొడుకు నాగ చైతన్య హీరోగా నిర్మించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను నాలుగు వందల థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నాగ్ ఇలా ప్లాన్ చేయడానికి కారణం మరేమీ కాదు. అనవసరంగా థియేటర్లను పోషించడం, షేర్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే. మీడియం సినిమాలు ఎక్కువ థియేటర్లలో వేయడం వల్ల షేర్ తగ్గిపోవడమే తప్ప, వేరు ఉపయోగం లేదని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి. అందుకే నాగ్ ముందు జాగ్రత్త పడినట్లున్నారు.

ఇటీవల కేశవ సినిమాను 700 వరకు థియేటర్లలో వేసారు. అర్బన్ ఏరియాలో వచ్చిన షేర్ కాస్తా చిన్న సెంటర్లలో వచ్చిన డెఫిసిట్ మింగేస్తోంది. దానివల్ల గ్రాస్ కనిపిస్తుంది కానీ, లాభం అంతగా కనిపించదు. అందుకే కేవలం సెలెక్టెడ్ గా నాలుగు వందల థియేటర్లను తీసుకున్నాడు నాగ్.

అయితే ఇందువల్ల కూడా సమస్య లేకపోలేదు. వారంరోజుల్లో మార్కెట్ లోకి పైరసీ సీడీ వచ్చేస్తుంది. ఆ లోపుగానే సినిమా డబ్బులు చేసుకోవాలి. అయితే సినిమా బాగుందని టాక్ వస్తే, జనం థియేటర్ కు రావడానికి వెనుకాడం లేదు ఇప్పుడు. అదే ధైర్యంతో నాగ్ ముందుకు వెళ్తున్నట్లున్నారు. పైగా ఈ సినిమాను నాగ్ స్వయంగా నిర్మించడమే కాదు, విడుదల కూడా ఆయనే స్వయంగా చేసుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?